.jpg)
కాల్వలోకి దూసుకెళ్లిన కారు
నల్గొండ,
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం చాకిరాల వద్ద వేగంగా వచ్చిన ఎ కారు అదుపుతప్పి నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరంతా శుక్రవారం ఉదయం ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. కాలువలో యువకులు గల్లంతైన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.అదుపుతప్పి నాగార్జున సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన స్కార్పియోను గుర్తించారు. వాహనం నంబర్.. AP31 BP 333. ప్రమాదంలో గల్లంతైన హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో ఉన్న అంకుర్ హాస్పిటల్‌లో పని చేస్తున్నారు. వీరంతా చాకిరాలలో తమ సహోద్యోగి విమలకొండ మహేష్ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
1. అబ్దుల్ అజీద్ (45)
2. రాజేష్ (29)
3. జాన్సన్ (33)
4. సంతోష్ కుమార్ (23)
5. నగేష్ (35)
6. పవన్ కుమార్ (23)