
మద్యం మత్తులో యువకుడి కారు డ్రైవింగ్…ఎస్సైకు తీవ్ర గాయాలు
హైదరాబాద్,
మద్యం మత్తులో ఒక యువకుడు కారు నడిపాడు. వాహనం అదుపుతప్పడంతో దారిన పొతున్న ఒక బైకును ఢీకొంది. బైకు సైనున్న పోలీసు ఎస్సై తీవ్ర గాయాల పాలయ్యాడు. హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసులు సైదాబాద్ నుంచి పంజాగుట్టకు వెళుతున్నాడు. చాదర్ ఘాట్ పిఎస్ లిమిట్స్ లోని మెరిడియన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా కారు వచ్చి ఢీకొంది. ఎస్ఐ ను ఢీకొట్టిన కార్ డ్రైవర్ ఆర్షద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు , అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. గాయపడ్డ ఎస్సైను మలక్ పేట్ యశోద హాస్పిటల్ కు తరలించారు.