
తేజస్వినిని పరామర్శించిన మంత్రి అళ్ల నాని
ఏలూరు
ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ తేజస్విని ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శనివారం పరామర్శించారు. ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రిలో తేజస్విని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆళ్ల నాని. సీఎం జగన్ ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారని, బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తేజస్విని భవిష్యత్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పిస్తామని భరోసా. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఆళ్ల నాని. జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ తో మాట్లాడి బాధ్యుడిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. యువతి కి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.