
పోలీసులు వేధిస్తున్నారని దంపతుల ఆత్మహత్యాయత్నం
కడప
పోలీసులు వేధిస్తున్నారని దంపతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి ఇంటికి పంపించకుండా వేధిస్తున్నారని మనస్తాపంతో కడపలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన మురళీధర్, నాగ సువర్ణలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ప్రస్తుతం దంపతులిద్దరూ స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.