YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.263.99 కోట్లు రూ.10 వేల లోపు డిపాజిట్దారులకు చెల్లింపు 3,69,655 మంది డిపాజిటర్లకు న్యాయం

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.263.99 కోట్లు రూ.10 వేల లోపు డిపాజిట్దారులకు చెల్లింపు 3,69,655 మంది డిపాజిటర్లకు న్యాయం

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.263.99 కోట్లు రూ.10 వేల లోపు డిపాజిట్దారులకు చెల్లింపు
3,69,655 మంది డిపాజిటర్లకు న్యాయం
అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్
విజయవాడ 
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.263.99 కోట్లు విడుదల చేసిందని, సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన దాదాపు 3.70 లక్షల మందికి వెంటనే పైకం చెల్లిస్తారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. డీఎల్ఎస్ ద్వారా వారి వారి ఖాతాలలో ఆ మొత్తం జమ అవుతుందని ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులెవ్వరూ అధైర్య పడవద్దని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ దిశలో సీఎం  వైయస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే రూ.20 వేల లోపు డిపాజిట్దారులకు కూడా ఆ మొత్తం చెల్లిస్తారని చెప్పారు. అగ్రి గోల్డ్ బాధితులకు ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం  వైయస్ జగన్, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారని, అందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటామని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రూ.1150 కోట్లు కేటాయించి, రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారందరికీ చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఆ పని చేస్తున్నారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని  వైయస్ జగన్ అసెంబ్లీలోనూ చెప్పారని, ఆ తర్వాత క్యాబినెట్ సమావేశంలో దాన్ని ఆమోదింప చేశారని శనివారం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. 
3.70 లక్షల మందికి
అగ్రిగోల్డ్ సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి వెంటనే చెలించే విధంగా రూ.263.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అప్పిరెడ్డి చెప్పారు. దీని ద్వారా 3,69,655 మంది డిపాజిట్దారులకు న్యాయం జరుగుతుందని ఆయన వెల్లడించారు. డీఎల్ఎస్ సంస్థ ద్వారా వారి వారి ఖాతాల్లో ఆ మొత్తం జమ చేస్తారని తెలిపారు.

Related Posts