YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సోసైటీ చెరువుల్లో అక్రమంగా చేపలు

సోసైటీ చెరువుల్లో అక్రమంగా చేపలు

సోసైటీ చెరువుల్లో అక్రమంగా చేపలు
నల్లగొండ, 
ప్రభుత్వ సొసైటీ చెరువుల్లో అక్రమంగా చేపలు పెంచుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, మత్స్యకారుల అమాయకత్వం వారికి కలిసి వస్తోంది. సొసైటీలకు ఎంతో కొంత ముట్టజెప్పి తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సొసైటీలతో అగ్రిమెంట్లుకూడా రాయించుకుంటున్నారు. సొసైటీ చెరువుల్లో చేపలు పెంచుకునే హక్కు కేవలం మత్స్యకార సొసైటీలకు మాత్రమే ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు పెంచుకోవడానికి వీలు లేదు. అయితే రాష్ట్రంలో చాలా చోట్ల  దళారులు ప్రత్యేకంగా చేప పిల్లలు తెచ్చి వాటిలో పెంచుతున్నారు.ఈ తతంగం అంతా అధికారులకు తెలిసినప్పటికీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మత్స్యశాఖ పరిధిలోని సొసైటీలకు చేప పిల్లలను ఉచితంగా అందిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలు పెరిగాక వాటిని సొసైటీలో సభ్యత్వం ఉన్న మత్స్యకారులు  అమ్ముకొని జీవనోపాధి పొందాల్సి ఉంటుంది.  అయితే చాలా చోట్ల మత్స్యకారుల పాత్ర చెరువుల్లో చేపలు వదిలేంత వరకే ఉంది. తర్వాత చెరువులపై అజమాయిషీ అంతా దళారులదే.మత్స్యకారులే సొసైటీ ద్వారా సొంతంగా చేప పిల్లలను కొని పెంచుకునేవారు. అవి పెరిగాక స్థానిక అవసరాలకు ఉంచుకొని మిగతా వాటిని  చెరువుల వద్దకు వచ్చే దళారులకు అమ్మేవారు. దగ్గరలో మార్కెట్ సౌకర్యాలు లేకపోవడం, ట్రాన్స్ పోర్ట్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని దళారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను ఇవ్వడంతో పాటు చేపలను రవాణా చేసుకోవడానికి ఫోర్ వీలర్, స్థానికంగా తిరిగి అమ్ముకోవడానికి టూ వీలర్ వాహనాలను ఇస్తోంది. దీంతో దళారులు మత్స్యకారులకు మాయమాటలు చెప్పి వాళ్ల చేపలను పెంచుకుంటున్నారు. “చేపల రవాణా కష్టం. రాష్ట్రంలో సరైన రేటు రాదు. ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముతాం. మీ వల్ల అది కాదు. నష్టపోతారు” అని దళారులు మత్స్యకారులను బురిడీ కొట్టిస్తున్నారు. చేపలను తాము కొనాలంటే తమ చేపలను కూడా ఇందులో పెంచుకోవాలని దళారులు కండిషన్ పెడుతున్నారు. దీంతో మత్స్యకారులు చేసేదేమీ లేక సరే అంటున్నారు. సొసైటీ తరపున అగ్రిమెంట్ను కూడా దళారులు రాయించుకుంటున్నారు. ఒక్కో చెరువును బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు. చేపలు పట్టిన సమయంలో మత్స్యకార సొసైటీలో ఉన్న సభ్యులకు కిలో చొప్పున ఇస్తూ మత్స్యకారులను చెరువు దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదనే
ఆరోపణ ఉంది.చేపల పెంపకం, రవాణా,అందుబాటులో ఉన్న మార్కెట్లపై మత్స్యకారులకు సరైన అవగాహన లేకపోవడంతోనే దళారులకు చెరువులను అప్పగిస్తున్నారు. ప్రభుత్వం చేపల పంపిణీని చేపట్టినప్పటికీ వాటి పోషణ, వాటికి ఇవ్వాల్సిన  వ్యాక్సిన్లపై అవగాహన ఇవ్వడం లేదు.  ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలు నాసిరకంగా ఉండడం, చెరువుకు తగ్గట్టుగా జీవించగలిగే చేప పిల్లలను ఇవ్వకపోవడం వల్ల కొన్ని  చేపలు ఎదగకపోగా మరికొన్ని చనిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు నష్టపోతున్నారు. ఒక్కోరోజు పెద్ద మొత్తంలో చేపలు పడితే స్థానికంగా వాటిని అమ్మడం కష్టం. దూర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు తరలించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న మార్కెట్లు, చేపల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై అధికారులు ఎలాంటి అవగాహన కల్పించడం లేదని మత్య్సకార్మిక సంఘం నేతలు

Related Posts