YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

అందమైన అమ్మాయిని చూసి...ఫేస్ బుక్కయ్యాడు...

అందమైన అమ్మాయిని చూసి...ఫేస్ బుక్కయ్యాడు...

అందమైన అమ్మాయిని చూసి...ఫేస్ బుక్కయ్యాడు...
కోల్ కత్తా, 
టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉందో.. అంతకంటే నష్టాలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో ఎక్కువగా వినియోగించేవారు ప్రొఫైల్ పిక్స్ చూసి మోసపోతున్నారు. తాజాగా కోల్‌కతాలోని ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రొఫైల్ ఫిక్‌లో అందమైన అమ్మాయి ఫోటో ఉంది కదా అని ఆమెతో రోజూ ఛాటింగ్ చేసేవాడు. ఓ రోజు తనను కలిసేందుకు లాడ్జికి రావాలని ఆమె కోరడంతో ఉత్సాహంగా వెళ్లాడు. తీరా అక్కడ సీన్ చూసి బెంబేలెత్తిపోయి చిక్కుల్లో పడ్డాడు.కోల్‌కతాకు చెందిన మోహిత్ అనే యువకుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించి అన్ని విషయాలు అందులో అప్‌డేట్ చేయడం, అపరిచితులతో ఛాటింగ్ చేయడం అతడికి అలవాటు. రెండు నెలల క్రితం ఓ అందమైన అమ్మాయా ఫ్రొఫైల్ పిక్ ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయి బాగుంది కదా అని వెంటనే రిక్వెస్ట్ ఓకే చేసి ఛాటింగ్ చేయడం ప్రారంభించాడు.కొద్దిరోజుల క్రితం ఎన్నిరోజులని ఛాటింగ్ చేసుకుంటాం, ఇద్దరం ఎక్కడైనా కలుద్దామని మోహిత్ కోరడంతో అవతలి వైపు నుంచి ఓకే అని సమాధానం వచ్చింది. ఆమె లాడ్జిలో కలుద్దామని చెప్పడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంచిగా రెడీ అయి లాడ్జిలో ఆమె చెప్పిన రూమ్‌ దగ్గరికి వెళ్లి ఉత్సాహంగా తలుపు తెరిచాడు. నల్లగా భారీ ఆకారంతో ఉన్న నలుగురు వ్యక్తులను చూసి షాకయ్యాడు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ నలుగురు మోహిత్‌ను బంధించి అతడి ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి భారీమొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు.దీంతో కంగారుపడిన మోహిత్ కుటుంబసభ్యులు వెంటనే కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోలీసులు వెంటనే అప్రమత్తమై ఫోన్ సిగ్నల్స్ ద్వారా లొకేషన్ కనుక్కుని కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. మోహిత్‌ను అతడి తల్లిదండ్రులకు అప్పగించి.. ఎప్పుడూ అపరిచితుల ఆహ్వానాలకు స్పందించవద్దని హెచ్చరించారు.

Related Posts