
వాగులో పడ్డ ట్రాక్టర్
నాగర్ కర్నూలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగు దాటుతుండగా భారీగా వరద రావడంతో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ తోపాటు ట్రాక్టర్ లో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి దగ్గర వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పోతున్నాయి. దీంతో వాగు దాటుతున్న సమయంలో నీటి ప్రవాహానికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ట్రాక్టర్ పై ఉన్న డ్రైవర్ తో పాటు మరోవ్యక్తి అదృష్టవశాత్తూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అదేవిధంగా పెద్దకొత్తపల్లి మండల కేంద్రం నుండి కోడేరు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. పస్పుల దగ్గర కూడా వాగుకు భారీగా నీరు వస్తుంది.