
ఎర్ర స్మగ్లర్లు పరార్
కడప
అధికారులు వెంబడిస్తుండటంతో, ఎర్రచందనంతో ఉన్న కారును అర్థరాత్రి వదిలి దుండగులు పరారైన ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఖాజీపేట మండలం అటవీ ప్రాంతం నుండి అధికారులు స్మగ్లర్ల కారును గుర్తించి వెంబడించడంతో వల్లూరు మండలం గోటూరు గ్రామం వద్ద ఎర్రచందనంతో ఉన్న కారును లాక్ చేసుకుని దుండగలు పరారయ్యారు. కారులో రెండు లక్షల రూపాయల విలువ చేసే 8 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు, అధికారులు కారును కడప కు తీసుకొని వెళ్ళినట్టు సమాచారం.