
రెండు కార్లు దగ్దం..నలుగురికి గాయాలు
సూర్యాపేట
కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలం మాధవరం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటుకుని వచ్చి మరో కారును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఢీ కొట్టిన కారులో దీపావళి టపాసులు ఉండటంతో మంటలుత్వరగా వ్యాపించాయి. ఘటనలో రెండు కార్లు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైయ్యాయి. ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 లో కోదాడ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అడుపు చేసారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.