
అంబులెన్స్ను ఢీకొన్న వ్యాను…. ఇద్దరి మృతి
సిద్దిపేట
సిద్దిపేట - బక్రిచెప్ట్యాల వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ అంబులెన్స్ను డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తుర్కపల్లికి చెందిన రాణి(40), గజ్వేల్కు చెందిన సునీత(35)గా గుర్తించారు. ఒక బంధువు మృతదేహాన్ని అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది.