YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ట్రాపేసి….జేబులు గుల్లచేసి….. అబ్బాయిలకు ఎర వేసే గ్యాంగ్ ఆరెస్టు

ట్రాపేసి….జేబులు గుల్లచేసి….. అబ్బాయిలకు ఎర వేసే గ్యాంగ్ ఆరెస్టు

ట్రాపేసి….జేబులు గుల్లచేసి…..
అబ్బాయిలకు ఎర వేసే గ్యాంగ్ ఆరెస్టు
విశాఖపట్నం 
అబ్బాయిలకు ఎర వేసిన కిలాడి గ్యాంగ్ను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ ఫేక్ డేటింగ్ సైట్లతో కిలాడి గ్యాంగ్ జనాలను ట్రాప్ చేస్తోంది. కోల్ కతా కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది బలవుతున్నారు.  . ఆన్లైన్ డేటింగ్ సైట్లతో అందమైన అమ్మాయిలు తమ హస్కీ వాయిస్తో అబ్బాయిలకు మత్తెక్కించి ట్రాప్లోకి దించుతున్నారు. కోల్కతా కేంద్రంగా గ్యాంగ్ ఆగడాలు సాగుతున్నట్లు, ఓస్లాం ఐటీ ముసుగులో దందా చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో 24 మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను పోలీసులు కలకత్తాలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వారి వద్ద నుంచి 40 సెల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. 
ముందుగా అందమైన అమ్మాయిల ఫొటోలను పెట్టి, పలు ఆకర్షణీయమైన ఆఫర్లతో జనాలను ఈ గ్యాంగ్ ట్రాప్ చేస్తుంది. గ్యాంగ్ కు చెందిన అమ్మాయిలు తీయని మాటలతో కస్టమర్లను ఆకట్టుకుని, వారి జేబులను గుల్ల చేస్తారు. 
విశాఖలో ఒకరి నుంచి రూ. 18 లక్షలు, మరొకరి నుంచి రూ. 3 లక్షలను ఈ గ్యాంగ్ కాజేసింది. ఇంకా బయటపడని బాధితులు చాలా మందే ఉంటారని అనుమానం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. తీగ లాగితే కోల్ కతాలో డొంక కదిలింది.

Related Posts