YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రామగుండం  
రామగుండం పోలీసు కమీషనరేట్ పరిధిలోని మంథని వెళ్ళు మార్గంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ పోలీసులు పట్టుకున్నారు. గుంజపడుగు వద్ద సిరోంచకు అక్రమంగా డిసిఎంలో తరలిస్తున్న సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ వివరాల ప్రకారం.. టాస్క్ ఫోర్సు సీఐ, సిబ్బందితో కలిసి మంథనికి వెళ్తుండగా.. కొంతమంది పీడీఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం వారికి అందింది. దీంతో డీసీఎంను ఫాలో చేసిన పోలీసులు..  డీసీఎంను అడ్డగించారు. అందులో సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. దీంతో డీసీఎం ను సీజ్ చేసిన పోలీసులు అక్రమానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.నిందితుల వివరాలు: మంథనికి చెందిన ఓదెల మహేందర్  డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మరొక వ్యక్తి.. బోగే సాగర్ కూడా మంథనికి చెందిన వాడే. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ పీడీఎస్ రైస్ ఎక్కడ నుండి ఎక్కడికి తరలిస్తున్నారని ఆరా తీశారు. దీనికి బదులుగా వారు డీసీఎం ఓనర్ రమేష్ మమ్మల్ని పంపించారని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని మంథని పోలీస్ లకు అప్పగించారు. పీడీఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ మరియు సిబ్బంది ప్రకాష్, మల్లేష్, సునీల్ లను రామగుండం సీపి సత్యనారాయణ అభినందించారు.

Related Posts