YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గుట్కా అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

గుట్కా అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

గుట్కా అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్ట్
యాబై వేల గుట్కా ప్యాకెట్లు, కారు స్వాధీనం
ఎమ్మిగనూరు 
నిషేధిత గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎమ్మిగనూరు పోలీసులు అరెస్ట్ చేశారు.స్థానిక పోలీస్ స్టేషన్లో సి.ఐ శ్రీధర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వై జంక్షన్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా పెద్దకడుబూరు గ్రామానికి చెందిన గెన్న మల్లికార్జున మరియు పట్టణానికి చెందిన ఉల్లిగడ్డల సిద్దన్న అనే ఇద్దరు వ్యక్తులు యాభై వేల రూపాయల విలువైన గుట్కా,పొగాకు ప్యాకెట్లను టి.ఎస్ 07 జి.ఎన్ 1088 నెంబరు గల మారుతి ఏకో వాహనంలో అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు.ఈ గుట్కా,ఖైని,పొగాకు ప్యాకెట్లను కర్ణాటక రాష్ట్రము నుండి ఎమ్మిగనూరుకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి యాబై వేల రూపాయలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని పంచనామా వ్రాసి అరెస్ట్ చేసి వారిని స్వాధీనం లోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడమైనదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్.ఐ శ్రీనివాసులు,కానిస్టేబుళ్లు ఖాద్రి,దశరత్ రామ్,ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts