
నిర్మల్ లో కార్డర్ అండ్ సర్చ్
నిర్మల్
మంగళవారం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామంలో పోలీసులు కార్డాన్ సర్చ్ ను జిల్లా ఎస్పీ శశిధర్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేని 98 మోటారు సైకిల్లు, మూడు ఆటోలు, 2,000/- విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో హెల్మెట్ పెట్టుకొని వాహనాలు నడుపుతామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ఎస్పి మాట్లాడుతూ హెల్మెట్ వాడకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు కోల్పోతున్నారు, కనుక తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి అన్నారు. అంతేకాకుండా వాహన బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు దక్షిణామూర్తి, వెంకట్ రెడ్డి, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, సి.ఐ.లు, వంద మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.