
పసిపాపపై అత్యాచార యత్నం..
నిందితుడి దేహశుద్ది
ఆఘాయిత్యం జరగలేదన్న పోలీసులు
వనపర్తి అక్టోబర్ 30 (
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో దారుణం చోటు చేసుకున్నది. రెండేళ్ల చిన్నారుపై తాత వరస అయ్యే వృద్ధుడు యాకుబ్ ఆత్యాచారం చేసినట్లు ప్రచారం జరిగింది. పాపకు తీవ్ర రక్తస్రావం జరగడంతో హాస్పిటల్ తరలించారు. పోలీసులు నిందితుడు యాకుబ్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. యాకుబ్ నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన వాడు. కొత్తకోటకు చెందిన మణెమ్మ కు కొన్ని సవత్సరా ల క్రితం పరిచయం ఏర్పడింది. తరచు కొత్తకోటలోని బిసి హాస్టల్ సమీపంలోఎస్సి కాలనిలో నివాసమున్న మణెమ్మ ఇంటికి తరుచుగా వస్తుండేవాడు. మన్నెమ్మ చిన్నకూతురు పుష్పలత రెండు సంవత్సరాల పాపను యాకూబ్ ను చూసుకొమ్మని బయటికి వెళ్లారు. నిందితుడు మంగళవారం పాపను పొదల్లోకి తీసుకెళ్లినప్పుడు స్థానికులు చూసి దేహశుద్ధి చేశారు. జరిగిన విషయం తెలుసుకున్న కాలనీ వాసులు మణెమ్మ ను నిందితుడు ను మరోసారి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించి ఎటువంటి అఘాయిత్యం జరగలేదు అని నిర్ధారించారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు