
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
గుంటూరు,
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి దగ్గర అర్థరాత్రి దాటిన తర్వాత తెనాల వైపు నుంచి వస్తున్న పాల వ్యాన్- ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమయ్యింది. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోయాయి.. దీంతో భయానక వాతావరణం ఏర్పడింది. చనిపోయినవారు పెదవడ్లపూడి, రేవేంద్రపాడుకు చెందిన స్థానికులుగా గుర్తించారు. ఆటోలో సొంత గ్రామాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.