
గుట్కా వ్యాపారస్తుల పై ఉక్కుపాదం
నూజివీడు
కృష్ణా జిల్లా వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా వ్యాపారస్తుల పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం స్థానిక బోర్డర్ చెక్ పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు చేసట్టారు. ఒక ద్విచక్ర వాహానాన్ని అనుమానంతో సోదాలు జరిపారు. బైకు పై వచ్చిన ఖమ్మం వ్యాపారస్తులు ఏ సాయి కృష్ణ , కుమార్ రాజు అనే ఇద్దరినుంచి 17.850 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధినం చేసుకున్నారు. నిందితులను, వాహనాన్ని కుడా అదుపులో తీసకున్నామని వత్సవాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సోమేశ్వరరావు తెలిపారు.