YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురు వ్యక్తిగత హజరు మినహాయింపు పిటిషన్ కొట్టివేత

ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురు వ్యక్తిగత హజరు మినహాయింపు పిటిషన్ కొట్టివేత

ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురు
వ్యక్తిగత హజరు మినహాయింపు పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్ 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది.  జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి.. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బందని, వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 కాగా సీబీఐ వాదనలను న్యాయస్థానం సమర్ధించింది. జగన్కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడంవల్ల అతని కేసులు, సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ వాదనలు వినిపించింది. జగన్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, అందుకే అప్పుడు ఆయనను అరెస్టు చేయడం జరిగిందని, అలాంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, అధికారులంతా ఆయన చెప్పినట్లు వినాల్సి ఉంటుందని.. ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.
 అప్పటికీ, ఇప్పటికీ కేవలం పరిస్థితులు మారాయని, నేరంలో ఎలాంటి మార్పు జరగలేదన్న విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వవద్దన్న సుప్రీం కోర్టు సూచనను సీబీఐ న్యాయస్థానం ముందుంచింది. కాగా జగన్ ఏపీ సీఎంగా ఉన్నందువల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని, జగన్ ప్రతి వారం కోర్టుకు హాజరవడంవల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, ప్రజాపరిపాలన దృష్ట్యా ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Related Posts