
మాజీ న్యాయమూర్తిపై కేసు నమోదు
హైదరాబాద్ నవంబర్ 1,
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు పై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోడలు సింధు శర్మను వేధించిన కేసులో ఆయనపై 354 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నూతి రామ్మోహన్ రావు తో పాటు ఆయన కుమారుడు వశిష్ట, భార్యపై పోలీసులు ఇదివరకే 498a కింద కేసు నమోదు చేశారు. తనపై భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలను నూతి రామ్మోహన్ రావు కోడలు సిసిఎస్ పోలీసులకు నెల రోజుల క్రితం అందించారు. దీంతో పోలీసులు అదనంగా 354 సెక్షన్ ను వారం రోజుల క్రితం నమోదు చేశారు.
===================