Highlights
సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త. . . . .!
కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి
కర్నూలు నవంబర్ 1
ఆన్ లైన్ లో ఓ.ఎల్.ఎక్స్ లో కొత్త బైక్ లేదా కొత్త కారును చూసి తక్కువ ధరకు వస్తుందని ఆశపడి డబ్బులు వేస్తున్నారా. అయితే మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్టేనని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఓ.ఎల్.ఎక్స్ లో కొత్త బైక్ లేదా కొత్త కారును చూసి తక్కువ ధరకు వస్తుందని గుర్తు తెలియని వ్యక్తి తో మీరు ఫోన్ లో మాట్లాడితే ఆ గుర్తు తెలియని వ్యక్తి తాను మిలటరీ లో పనిచేస్తున్నానని, నాకు బదిలీ అయిందని,అందుకే తన వెహికల్ ను అమ్మేస్తున్నాను అని మిమ్మల్ని నమ్మించి,మొదటగా ఆర్మీ లో పనిచేస్తున్నట్టు సృష్టించిన తన నకిలీ ఐడెంటిటీ కార్డ్, పాన్ కార్డ్,ఆధార్ కార్డు వంటి వాటిని తమకు చూపించి,తన యొక్క మాటలతో మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర నుండి డబ్బులను తన ఖాతాలో వేయించుకొని తరువాత మీకు వెహికల్ ఇవ్వకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని వెళతాడు అని ప్రజలను ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు.అటువంటి గుర్తు తెలియని వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ తెలిపారు.ఆ వ్యక్తి చూపించిన నకిలీ ట్రాన్స్ పోర్ట్ పత్రాలను చూసి ప్రజలు మోసపోతున్నారు.
కావున ప్రజలు ఇటువంటి సైబర్ నేరగాళ్ళ మాయ మాటలకు లోబడకుండా అప్రమత్తం గా ఉండాలని, అటువంటి నేరగాళ్ళు మీకు ఫోన్ చేసిన వెంటనే మీరు దగ్గరలో గల పోలీసు స్టేషన్ లో గాని,లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని పిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రతి శుక్రవారం సైబర్ నేరాలకు సంబంధించిన “ క్రైమ్ అలర్ట్ “ అర్టికల్ విడుదల చేయబడుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని సైబర్ నేరాల (ఆన్లైన్ షాపింగ్ ఫ్రాడ్స్,జాబ్ ఫ్రాడ్స్,ఇమెయిల్ ఫ్రాడ్స్,లక్కీ డ్రా ఫ్రాడ్స్, లాటరీ ఫ్రాడ్స్,మాట్రిమోని ఫ్రాడ్స్) బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
