YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కేసులకు ప్రభుత్వ సొమ్మా..?

జగన్ కేసులకు ప్రభుత్వ సొమ్మా..?

జగన్ కేసులకు ప్రభుత్వ సొమ్మా..?
విజయవాడ, నవంబర్ 1, 
ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌ను దాఖలు చేయగా.. సీబీఐ జగన్ పిటిషన్‌పై గట్టిగా వాదనలు వినిపించింది. ఈ కేసులో పరిస్థితులు మారాయని.. నేరంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. జగన్ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయాలని ప్రయత్నించారని.. జగన్ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని.. మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని చెప్పింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.సీబీఐ కోర్టు తీర్పుపై టీడీపీ నేతలు స్పందించారు.. జగన్ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కోర్టు వాయిదాలకు ప్రతి శుక్రవారం వెళితే.. ప్రభుత్వ వృథా అవుతుందని అంటున్నారని.. వ్యక్తిగత కేసులకు సొంత ఖర్చులు పెట్టుకోవాలి అన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. ఈ ఖర్చును ప్రభుత్వమెలా భరిస్తుందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ పార్టీ కేసులు పెడుతోందని విమర్శించారు.ఇటు జగన్ వ్యక్తిగత హాజరుపై సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. క్రిమినల్ నేరాలు కంటే ఆర్థిక నేరాలు ప్రమాదకరమని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. మనీ లాండరింగ్ కేసుల్లో జగన్‌కు శిక్ష పడటం ఖాయమని.. ఆయనకు ఎప్పుడు శిక్ష పడుతుందని వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Posts