YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం Karnataka

యడ్డీ చెమటోడస్తున్నారుగా...

యడ్డీ చెమటోడస్తున్నారుగా...

యడ్డీ చెమటోడస్తున్నారుగా...
బెంగళూర్, 
ఆ పదిహేను నియోజకవర్గాలపై అన్ని పార్టీలూ ప్రత్యేక దృష్టి పెట్టాయి. అధికార భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికలు జరిగే పదిహేను అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, జేడీఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో గెలిచి రాజీనామా చేయడంతో సహజంగానే ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీపై సానుభూతి ఎక్కువగా ఉంటుంది. దానిని పూర్తి స్థాయిలో తొలగించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్రంగానే శ్రమిస్తున్నారు.ముఖ్యంగా పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధుల వరదను పారిస్తున్నారు. అక్కడి సమస్యలను వెంటనే పరిష్కరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో వార్డుల వారీగా ప్రధాన సమస్యలు, వెంటనే పరిష్కరించగలిగినవి, నిధులు వెచ్చించాల్సిన సమస్యలు, హామీలు ఇచ్చేవన్నింటినీ యడ్యూరప్ప నివేదిక రూపంలో తెప్పించుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే ముందే వీటిలో ప్రధాన సమస్యలు పరిష్కరించి ఆ నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూల వాతవరణం ఏర్పాటు చేయాలని యడ్యూరప్ప భావిస్తున్నారు.ఇప్పటికే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే కోర్టు తీర్పు తర్వాత దీనిపై స్పష్టత రానుంది. వారికి కాని వారి వారసులకు గాని టిక్కెట్లు ఇవ్వడం గ్యారంటీ అని తేలిపోయింది. అందుకే యడ్యూరప్ప వారితో తరచూ మాట్లాడుతూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. కాంగ్రెస్ లో ఉంటే నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి పనులు చేయలేకపోయేవారమన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.ముఖ్యంగా మెడికల్ కళాశాలల మంజూరు, ఆసుపత్రిల్లో పడకల సంఖ్య పెంపు, వరద పరిహారం అందజేయడంలో ఈ నియోజకవర్గాల్లో పనులు వేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. అందుకే యడ్యూరప్ప అంత ధైర్యంగా ఉన్నారంటున్నారు. కనీసం ఎనిమిది స్థానాలను గెలుచుకుంటే తన పదవికి, ప్రభుత్వానికి ఏమాత్రం ఢోకా ఉండదు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తుండటంతో యడ్యూరప్ప ఈ పదిహను పై ప్రత్యేక దృష్టి పెట్టారు

Related Posts