YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

'భీష్మ' తొలి వీడియో దృశ్యాలకు విశేష ఆదరణ 

'భీష్మ' తొలి వీడియో దృశ్యాలకు విశేష ఆదరణ 

'భీష్మ' తొలి వీడియో దృశ్యాలకు విశేష ఆదరణ 
నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్రం యూనిట్. 'కథానాయకుడు నితిన్ 'నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా...కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం' అంటూ చెప్పే సంభాషణలతో, కేవలం కొద్ది క్షణాలే కనిపించే ఈ వీడియో కి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్త్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ...ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను సుప్రసిద్ధ దర్శకుడు, మా గురూజీ  త్రివిక్రమ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటం జరిగింది. వీటికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి.వీటికి ముందు ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదలచేయటం జరిగింది. వీటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభించింది.
 'భీష్మ' చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.
నటీ,నటులు : నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ  తదితరులు నటిస్తున్నారు.

Related Posts