YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

బీమిలీలో ప్రేమించుకున్నాం ఎమ్మెల్యే రోజా

బీమిలీలో ప్రేమించుకున్నాం ఎమ్మెల్యే రోజా

బీమిలీలో ప్రేమించుకున్నాం ఎమ్మెల్యే రోజా
విశాఖపట్నం నవంబర్ 11 
ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో అనుభూతులకు వేదికయ్యింది భీమిలి ఉత్సవాలు. సముద్ర తీరాన అత్యంత ఉత్సాహ భరితంగా సాగిన సంబరాల్లో సామాన్యుల నుంచి వీఐపీల వరకు భీమిలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా ఒక అడుగు ముందుకేసి.. తన ప్రేమ చిగురించినప్పటి రోజుల్లోకి వెళ్లారు. తన లైవ్ స్టోరీపై రోజా ఇంట్రస్టింగ్ స్టోరీపై విశాఖలో రోజా ఆశక్తికర విషయాలను చెప్పారు. చామంతి సినిమా కోసం ఇదే భీమిలి బీచ్‌ లో ఏడాది పాటూ షూటింగ్ చేశామని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రోజా. భానుమతి, హీరో ప్రశాంత్, తాను ఏడాది ఇదే బీచ్‌లో ఉన్నామని.. తన సినిమా కెరీర్‌కు నాంది పలికింది ఇక్కడే అని భీమిలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. తన భర్త సెల్వమణితో ప్రేమ పుట్టింది కూడా ఇక్కడేనని చెప్పుకొచ్చారు. సెల్వమణితో 12 ఏళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామన్నారు భీమిలితో తనకు ఎంతో అనుబంధం ఉందన్న రోజా.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల షూటింగ్‌‌లు అక్కడ జరిగినట్లు చెప్పారు. సువిశాల సాగరతీరం, ఎర్రమట్టి దిబ్బలు, పచ్చటి కొండలు.. కేవలం పర్యాటకులనే కాకుండా.. ప్రేమికులను సైతం… భీమిలి ఆకర్షిస్తుందని ఆమె చెప్పారు. అంతేకాకుండా.. తన మనసులోని ప్రేమను బయటపెట్టడానికి.. డైరెక్టర్ సెల్వమణి సైతం.. ఎంచుకున్న ప్రాంతం భీమిలేనని చెప్పారు.

Related Posts

0 comments on "బీమిలీలో ప్రేమించుకున్నాం ఎమ్మెల్యే రోజా"

Leave A Comment