YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

శ్రీకాకుళంలో కార్తీక శోభ

శ్రీకాకుళంలో కార్తీక శోభ

శ్రీకాకుళంలో కార్తీక శోభ
శ్రీకాకుళం 
శ్రీకాకుళం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ముఖ్యంగా మహిళలు శివాలయాలకు పెద్దసంఖ్యలో పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రమిదలు ఏర్పాటు చేసి దీపాలను వెలిగించి శివుని అనుగ్రహం కోసం శివప్రార్థనలు చేస్తున్నారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి.నెలరోజులూ చేసే పూజల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి పూజల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుండి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణం శుద్ది అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది.  భక్తులకు ఎటువంటిఅసౌకర్యం కలగకుండా ప్రమిదలు ఏర్పాటు చేయడమే కాక ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకున్నారు.

Related Posts