YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పాటలు, ఆటలతో బన్నీ,మహేష్

పాటలు, ఆటలతో బన్నీ,మహేష్

పాటలు, ఆటలతో బన్నీ,మహేష్
హైద్రాబాద్, నవంబర్ 15
స్టార్ హీరోలు ఫ్యామిలీ తో స్పెండ్ చేసే టైం అభిమానులకు ఎంతో నచ్చుతుంది. అందుకే హీరోలు కూడా తమ ఫ్యామిలీస్ ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్లిన ఫొటోస్ ఎప్పటికప్పుడు ఆభిమానులకు అందుబాటులో ఉంచుతారు. అయితే స్టార్ హీరోలు ఇప్పుడు తమ పిల్లలతోను సంపాదించడం మొదలెట్టేసారు. ఇండస్ట్రీలో అందరికన్నా క్రేజ్ ఎక్కువ మహేష్ కే ఉంది. మహేష్ సినిమాలకే కాదు, ఆయన యాడ్స్ కి కూడా క్రేజ్ ఎక్కువ. తాజాగా మహేష్ బాబు తన కూతురు సితార, భార్య నమ్రత, కొడుకు గౌతమ్ తో కలిసి ఓ యాడ్ చేస్తే.. దానికి ఆయన 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. మరి మహేష్ ఫ్యామిలికున్న క్రేజ్ తో మహేష్ అంత పెద్ద మొత్తంలో సంపాదించాడు.ఇక తాజాగా అల్లు అర్జు కూడా ఆయన పిల్లల్ని రంగంలోకి దింపాడు. తన ఫ్యామిలీ కున్న క్రేజ్ తో అల్లు అర్జున్ తన సినిమా అల వైకుంఠపురములో సాంగ్ టీజర్ కోసం తన కొడుకు అయాన్, కూతురు అర్హ ల క్రేజ్ ని వాడేసుకుని బ్యాడ్ డాడీ అయ్యాడు. అర్హ క్యూట్ లుక్స్, అయాన్ డాన్స్ స్టెప్స్ తో అల వైకుంఠపురములో ఓ మై గాడ్ సాంగ్ టీజర్ కి పిచ్చ క్రేజ్ వచ్చేసింది. అల్లు అర్జున్ మాదిరి ఆయన కొడుకు అయాన్ కూడా డాన్స్ లో నెంబర్ వన్ అయ్యేలాకనబడుతున్నాడు. అర్హ అయితే క్యూటీ లుక్స్ తో సూపర్బ్ అనిపించింది. మరి సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫ్యామిలీ పిక్ కనబడితే పిచ్చెక్కి లైక్స్ కొట్టే ఫ్యాన్స్, ఇప్పుడు ఏకంగా హీరోల కొడుకు, కూతుర్లు ఇలా యాడ్స్ లోనో, సాంగ్స్ లోనో కనబడితే ఆ లైక్స్ మోత మాములుగా ఉండదు. మరి మహేష్ తన పిల్లల్ని యాడ్స్ తో రంగంలోకి దింపితే అల్లు అర్జున్ పాటతో పిల్లల్ని పరిచయం చేసాడు.

Related Posts