YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

లక్ష దీపోత్సవం కార్యక్రమం పోస్టర్ విడుదల

లక్ష దీపోత్సవం కార్యక్రమం పోస్టర్ విడుదల

లక్ష దీపోత్సవం కార్యక్రమం పోస్టర్ విడుదల
తుగ్గలి   నవంబర్ 19     
లక్ష దీపోత్సవం కార్యక్రమం యొక్క పోస్టర్ ను పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆవిష్కరించారు.లక్ష దీపోత్సవం 25-11-2019 న సాయంత్రం పత్తికొండ ప్రభుత్వ కళాశాల నందు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని,ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి మహా స్వామి వారు హాజరవుతారని తెలియజేసారు.ఈ కార్యక్రమం కు సంబంధించి  కర్నూల్ లోని  స్వగృహం నందు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పోస్టల్ ను ఆవిష్కరించడం జరిగింది.25న జరిగే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కార్యకర్తలు మరియు భక్తులు విచ్చేసి విజయవంతం చేయాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి గారు,వెల్దుర్తి మరియు తుగ్గలి మండలాల కన్వీనర్లు రవి రెడ్డి,జిట్టా నాగేష్  మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిరాయి జగన్నాథ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts