YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా దేశీయం

కలిస్తే...కుమ్మేస్తారా...

కలిస్తే...కుమ్మేస్తారా...

కలిస్తే...కుమ్మేస్తారా...
చెన్నై, నవంబర్ 30
తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పాతుకు పోయి ఉన్న ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొనడం జాతీయ పార్టీలకు సాధ్యం కాలేదు. జయలలిత, కరుణానిధి తర్వాత అంత ఇమేజ్ ఉన్న నాయకుడు తమిళనాడులో లేరన్నది కాదనలేని వాస్తవం. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాజకీయ శూన్యత తమిళనాడులో ఏర్పడందన్నదీ నిజమే. ఈ రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకోవడానికే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. రజనీకాంత్ ఇంకా రాజకీయ పార్టీని ప్రకటించలేదు. అయినా 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉంటుందని ప్రకటించారు.నిజానికి తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే లు బలమైన పార్టీలు. 2016 ఎన్నికలకు ముందు వరకూ రెండు పార్టీలకూ విడతల వారీగా తమిళ ప్రజలు అవకాశం కల్పించారు. 2016లో మాత్రమే రెండోసారి జయలలిత అధికారంలోకి వచ్చారు. అయితే జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతుంది. అధికారంలో ఉంది కాబట్టి కొద్దోగొప్పో నేతలు అంటిపెట్టుకుని ఉన్నారు. ఇక డీఎంకే పరిస్థితి కొద్దోగొప్పో పరవాలేదు. బలమైన వాయిస్ ఉన్న స్టాలిన్ ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.అయితే ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్ పార్టీ రాబోతోంది. రజనీకాంత్ ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నారు. నిదానంగానే పార్టీని పటిష్ట పర్చాలన్నది రజనీకాంత్ భావన. రజనీకాంత్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉండటం, తమిళనాడులో సినీరంగ ప్రముఖులను అందలమెక్కించడం వంటి అంశాలు ఆయనకు కలసి వస్తాయని భావిస్తున్నారు. అయితే ఇటీవల రజనీకాంత్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కమల్ హాసన్ తో కలసి నడిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తాము గత కొన్నేళ్లగా స్నేహితులమని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.కానీ రజనీకాంత్, కమల్ హాసన్ లు నిజంగా కలిస్తే ఓట్ల వర్షం కురియక మానదు. ఇదే డీఎంకే, అన్నాడీఎంకేల భయం. మరోవైపు రజనీకాంత్, కమల్ హాసన్ లది విరుద్ధ మనస్తత్వం. కమల్ హాసన్ దూకుడు స్వభావం కలిగిన నేత కాగా, రజనీకాంత్ మృదుస్శభావి. కమల్ హాసన్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి అయితే రజనీకాంత్ ఆధ్మాత్మిక చింతన కలిగిన వారు. ఇలా ఇద్దరూ రాజకీయాల్లో కలసి పోటీ చేయడం సాధ్యమేనా? అన్న చర్చ తమిళనాడులో మొదలయింది. ఎన్నికల్లో కలసి పోటీ చేయకముందే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తుతాయని డీఎంకే, అన్నాడీఎంకే గట్టిగా విశ్వసిస్తున్నాయి. మరి రజనీ, కమల్ కలసి తమిళనాడును శాసిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts