YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

దుమ్మురేపిన సరిలేరు నీకెవ్వరులో సాంగ్

దుమ్మురేపిన సరిలేరు నీకెవ్వరులో సాంగ్

దుమ్మురేపిన సరిలేరు నీకెవ్వరులో సాంగ్
హైద్రాబాద్, డిసెంబర్ 4,
సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సూపర్‌ స్టార్‌ మండేస్‌ అంటూ ప్రతీ సోమవారం ఓ అప్‌డేట్‌ ఇస్తున్నారు.ప్రమోషన్‌లో భాగంగా ఈ సోమవారం మైండ్‌ బ్లాక్‌ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకత్వంలో మాస్‌ బీట్స్‌తో రూపొందించిన ఈ పాటపై డివైడ్‌ టాక్‌ వచ్చిన యూట్యూబ్‌ వ్యూస్‌లో మాత్రం సంచలనాల నమోదు చేస్తోంది. మహేష్‌ మేనియాతో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ఈ పాట 24 గంటల్లో 9.2 మిలియన్ల వ్యూస్‌ సాధించింది.సౌత్‌లో తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ సాధించిన పాటగా రికార్డ్‌ సృష్టించింది మైండ్‌ బ్లాక్‌. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో చాలా కాలం తరువాత సీనియర్‌ నటి విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.కొంతకాలంగా క్లాస్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో ట్రెండ్‌ మారుస్తున్నాడు. కామెడీతో పాటు మాస్‌ యాక్షన్‌తోనూ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం భారీగా హైప్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా సూపర్‌ స్టార్‌ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే తీసుకువస్తుందంటున్నారు చిత్రయూనిట్‌.

Related Posts