YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

బ్యాంకులకు మరో ఆభరణాల సంస్థ కుచ్చుటోపీ

Highlights

  • రూ.800కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టిన కనిష్క్‌
  • రుణం మొత్తానికి వడ్డీ కూడా కలుపుకొని మొత్తం రూ.1000కోట్ల మేర బ్యాంకులు నష్టపోయినట్లు తెలుస్తోంది
బ్యాంకులకు మరో ఆభరణాల సంస్థ కుచ్చుటోపీ

చెన్నై: భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన గీతాంజలి గొలుసుకట్టు ఆభరణాల సంస్థ కేసు ఓ కొలిక్కి రాకముందే.. ఇప్పుడు మరో ఆభరణాల సంస్థ బండారం వెలుగులోకి వచ్చింది. కనిష్క్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సహా మరో 14 బ్యాంకులకు దాదాపు రూ.824.15కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. దీనిపై సీబీఐకి ఎస్‌బీఐ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చెన్నైలోని కనిష్క్‌ గోల్డ్‌ దుకాణం డైరెక్టర్స్‌ భూపేష్‌కుమార్‌, ఆయన భార్య నీతా జైన్‌పై సీబీఐకి ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది. ఎస్‌బీఐతో పాటు 14 కన్సార్టియం బ్యాంకుల వద్ద నుంచి కనిష్క్‌ జ్యూయలరీ దాదాపు రూ.800కోట్లకు పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టింది. రాత్రికి రాత్రే వాళ్లు దుకాణాలన్నింటినీ మూసివేసి, రికార్డులను కూడా మాయం చేసినట్లు ఎస్‌బీఐ సీబీఐకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రుణం మొత్తానికి వడ్డీ కూడా కలుపుకొని మొత్తం రూ.1000కోట్ల మేర బ్యాంకులు నష్టపోయినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబరులో ఎస్‌బీఐ కనిష్క్‌ జ్యూయలరీ యజమానిని రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది. రుణాలు వసూలు చేసేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తుండగా అసలు వాళ్ల ఆచూకీ తెలియడం లేదు. భూపేష్‌, నీతా జైన్‌లు మారిషస్‌ పారిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

గతేడాది ఏప్రిల్‌ నుంచి కనిష్క్‌ జ్యూయలరీ రుణాలు తీసుకున్న 14 బ్యాంకులకు డబ్బులు కట్టడం నిలిపివేసింది. ఇదేంటని ప్రశ్నించేందుకు బ్యాంకు అధికారులు ఆయా దుకాణాల వద్దకు వెళ్లగా అవన్నీ మూసేసి కనిపించాయి. ఎస్‌బీఐ రూ.215కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.115కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.50కోట్లు, సిండికేట్‌ బ్యాంకు రూ.50కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.45కోట్లు, ఐడీబీఐ, యూకో, తమిళనాడ్‌ మెర్కంటైల్‌ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌షీ, ఐసీఐసీఐ, సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కార్పొరేషన్‌ బ్యాంక్‌లు కోట్ల మేర కనిష్క్‌కు రుణాలు ఇచ్చాయి.

Related Posts