YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా

12న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు

12న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు

12న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు
హైద్రాబాద్, డిసెంబర్ 7, 
ఎట్టకేలకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు నోచుకుంటోంది. సినిమాకు సెన్సార్ బోర్డు u/a సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్. డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సారీ సారీ.. అలవాటులో పొరపాటు. ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకు వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ పెట్టారు. కానీ ముందుగా ఊహించినట్లుగానే సినిమాకు రాజకీయ సెగ తగిలింది.హైకోర్టు వరకు విషయం వెల్లడంతో వర్మ సినిమాకు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని టైటిల్‌ను మార్చారు. డైరెక్ట్‌గా ప్రస్తుత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ చూపించారు. ఈ సినిమాను ప్రకటించినప్పుడే ఎంతో వివాదాస్పదమైంది. సినిమాలో కేఏపాల్‌ను మరీ జోకర్‌గా చూపించడంతో ఆయన వర్మపై కేసు వేశారు. తాను ఎవరినీ ఉద్దేశించి పాత్రలు రూపొందించలేదని ఎంత చెప్పినా, వర్మ అసలు ఉద్దేశం ఏంటో అందరికీ తెలిసిందే. ఆ కారణంగానే సెన్సార్‌ సర్టిఫికేట్‌ విషయంలో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ విషయంలో వర్మ మాత్రం పట్టు వీడటంలో లేదు.ఇప్పటికే సెన్సార్‌ బోర్డ్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు వర్మ. `మేం ఎలాంటి సినిమాలు చూడాలో వారు ఎలా నిర్ణయిస్తారు. నన్ను ఎంత తొక్కితే అంత రెచ్చిపోతా. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్‌ కూడా తీస్తా` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి వర్మ తన పంతాను నెగ్గించుకున్నాడు. సినిమాను డిసెంబర్ 12న వదలనున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రాజకీయ పరంగా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో వర్మ ఎవర్ని బుక్ చేయనున్నారో వేచి చూడాలి.

Related Posts