YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ముందుకు సాగని కేంద్రం ప్రాజెక్టులు వరంగల్

ముందుకు సాగని కేంద్రం ప్రాజెక్టులు వరంగల్

ముందుకు సాగని కేంద్రం ప్రాజెక్టులు
వరంగల్, డిసెంబర్ 13,
కొత్త సెంట్రల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ ఇనిస్టిట్యూట్స్‌‌‌‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన వాటి ఏర్పాటులో మాత్రం సరైన చర్యలు చేపట్టడం లేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఎన్‌‌‌‌డీఏ ప్రభుత్వాన్ని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మొదటి ప్రభుత్వ హయాం నుంచి సీఎం కేసీఆర్ పలుసార్లు కోరారు. అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇతర ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో 2016 నవంబర్‌‌‌‌లో సైనిక్స్కూల్ మంజూరుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఈఏడాది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని భావించినా, పలు కారణాలతో కాలేదు. ములుగు జిల్లా జకారంలో దీని ఏర్పాటుకు జాగా కూడా కేటాయించారు. హెచ్‌‌‌‌సీయూ నుంచి ఓ ప్రొఫెసర్‌‌‌‌ను కోఆర్డినేటర్‌‌‌‌గా నియమించారు.కానీ నిధులు రాకపోవడంతో క్లాసులు స్టార్ట్‌‌‌‌ కాలేదని తెలుస్తోంది. ఈ సంస్థలతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం), రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌‌‌‌ఐడీ), జిల్లాకొక నవోదయ స్కూల్‌‌‌‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య కూడా పెంచాలని అడుగుతోంది. నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతోనే కేంద్రం వాటి మంజూరుకు వెనుకడుగు వేస్తుందనే వాదనలూ ఉన్నాయి. త్వరలో కొన్ని నవోదయ స్కూల్స్‌‌‌‌, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐఐఎం ఏర్పాటుకు పర్మిషన్ ఇస్తే జాగా రెడీ చేస్తమని అధికారులు చెప్తున్నారు.2016లోనే రాష్ట్రానికి సైనిక్ స్కూల్‌‌‌‌ మంజూరైంది. అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆయన సొంత జిల్లా వరంగల్‌‌‌‌లో పెట్టాలని నిర్ణయించారు. ధర్మసాగర్‌‌‌‌ మండలం ఎల్కతుర్తిలో 50 ఎకరాలు కేటాయించారు. స్కూల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. భూ సేకరణకు ప్రభుత్వం కొన్ని నిధులిచ్చింది. సైని క్ స్కూల్‌‌‌‌కు స్థల కేటాయింపుతో పాటు భవనాలు నిర్మించి ఇస్తే టీచింగ్‌ సిబ్బందిని కేంద్రం కేటాయిస్తుంది. వాళ్లకు జీతాలు ప్రభుత్వమే ఇవ్వాలి. అయితే పూర్తిస్థాయిలో బిల్డింగ్స్‌‌‌‌ కడితేనే స్కూల్ ప్రారంభిస్తామని కేంద్రం చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు అప్పటి ఎంపీ జితేందర్రెడ్డి విజ్ఞప్తి మేరకు మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా నారాయణపేటలో మరో స్కూల్‌‌‌‌ ఏర్పాటుకు రక్షణ శాఖ ఓకే చెప్పింది. దీని ప్రాసెస్ కూడా పెండింగ్‌‌‌‌లో పడింది. అయితే స్థల సేకరణలో వివాదం, నిధుల విడుదలలో జాప్యం వల్ల స్కూల్ఏర్పాటు ముందుకు కదలడం లేదని సమాచారం.

Related Posts