YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పొలిటికల్ జంక్షన్ లో కవిత...

పొలిటికల్ జంక్షన్ లో కవిత...

హైదరాబాద్, జూలై 16, 
పార్టీనే తనదంటున్నారు.. అధినేతను ఒక్క మాట అనడానికి కూడా ఇష్టపడట్లేదు. అపోజిషన్‌ గులాబీబాస్‌ను విమర్శిస్తే కూడా ఆమె సహించట్లేదు. కానీ అన్నతో పేచీ..కేసీఆర్‌ చుట్టూ దయ్యాలంటూ కుంపటి రాజేసి..పొలిటికల్‌ జంక్షన్‌లో నిల్చున్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్‌కు కాళేశ్వరం నోటీసులు ఇచ్చినా..చివరకు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చినా..ఆమె రియాక్ట్ అయ్యారు. కేసీఆర్‌ను విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఏకంగా ఇందిరాపార్క్‌ దగ్గర నిరసన కూడా తెలిపారు.ఆ ధర్నాలో ఒక్క బీఆర్ఎస్‌ నేత కూడా పాల్గొనలేదు..అది వేరే సంగతి. సరే అదంతా అలా ఉన్నా..లేటెస్ట్‌గా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నతో మొదలైన వివాదం… కవితపై ఆయన చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం లేచాయి. సోషల్‌ మీడియాలో అన్నివర్గాలు మల్లన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌ కూడా మల్లన్న మాటలను తప్పుబట్టారు. అయితే సొంత పార్టీ నుంచి మాత్రం కవితకు మద్దతు లభించలేదు.ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జగదీశ్వర్‌ రెడ్డి మినహా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులే కాదు పార్టీ ముఖ్యనేతలెవరూ మల్లన్న వ్యాఖ్యలపై కనీసం స్పందించలేదు. ఇదే ఎమ్మెల్సీ కవితను మరింత అసంతృప్తికి గురిచేస్తోందట. తనకు పార్టీ అండగా లేకపోవడం..కనీసం మాట వరుసకు అయినా ఖండిస్తూ ఓ ప్రకటనో, ట్వీటో చేయకపోవడం కవితను కలచివేస్తోందట. అందుకే ఇక కారులో ఉండే పరిస్థితి లేదనే నిర్ణయానికి కవిత వచ్చేశారన్న టాక్‌ విన్పిస్తోంది.. .బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ చర్యలను అపోజిషన్‌ బీఆర్ఎస్‌ తప్పుబడుతోంది. ఆర్డినెన్స్ తెచ్చి హడావుడి చేసే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శిస్తోంది. ఇదే సమయంలో జాగృతి తరఫున కవిత సంబరాలు చేయడం బీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ లైన్‌కు విరుద్దంగా కవిత వెళ్తున్నారన్న సంకేతాలు మంచివి కావని పలువురు కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. సేమ్‌టైమ్‌ ఆమె కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. లేటెస్ట్‌గా తీన్మార్‌ మల్లన్న కూడా అదే విషయాన్ని చెప్పారు. మొన్నటి క్యాబినెట్ విస్తరణలోనే కవిత మంత్రి కావాల్సి ఉండే అని ఓపెన్ స్టేట్‌మెంట్‌ ఇచ్చి చర్చకు దారితీశారు. ఈ డెవలప్‌మెంట్స్‌ నేపథ్యంలో కవితను బీఆర్ఎస్‌ అధినాయకత్వం చాలా లైట్ తీసుకుంటుందట.సోమవారం డే మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సుదీర్ఘంగా భేటీ అయి..బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం, బనకచర్ల, లోకల్‌ బాడీ పోల్స్, పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్‌పై డిస్కస్ చేశారట. కానీ కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు గురించి గానీ..కవిత సంబరాల అంశానికి సంబంధించి గానీ ఒక్కమాట కూడా కేసీఆర్‌ ప్రస్తావించలేదని తెలుస్తోంది.కనీసం ఆమె పేరును కూడా కేసీఆర్‌ ప్రస్తావించలేదని..దీంతో కేటీఆర్‌, హరీశ్‌లు కూడా ఆ విషయాన్ని మాట్లాడలేదని బీఆర్‌ఎస్‌ ఇన్‌ సైడ్‌ టాక్‌. ఇక కాళేశ్వరం విచారణకు వెళ్లేప్పుడు కేసీఆర్‌ను కలిసేందుకు కవిత వెళ్లగా అప్పుడు కూడా ఆయన కనీసం మాట్లాడడానికి ఇష్టపడలేదన్న లీకులు వచ్చాయి. అనారోగ్యంతో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ పొందుతున్న తండ్రిని పరామర్శించేందుకు వెళ్తే అక్కడ కూడా కవితను కేసీఆర్‌ పట్టించుకోలేదట.ఈ పరిస్థితులన్నీ గమనించిన కవిత..ఇక తాను బీఆర్ఎస్‌లో ఉండలేనని సన్నిహితులతో చెప్తున్నారట. పార్టీలో ఉండ‌డ‌మా.. బ‌య‌ట‌కు రావ‌డ‌మా? అనే విష‌యంపై అత్యంత క్లోజ్‌గా ఉండేవాళ్లతో డిస్కస్ చేస్తున్నారట కవిత. బీఆర్ఎస్‌ను వీడితే కొత్త పార్టీ పెట్టాలా లేక మరేదైనా పార్టీలో చేరాలా.? జాగృతి తరఫునే తన యాక్టివిటీని నడిపించి..కేసీఆర్ పిలిచి మాట్లాడినప్పుడే వెళ్లాలా అనే దానిపై కవిత మల్లగుల్లాలు పడుతున్నారట.
ఇక మొదటినుంచీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓ వ‌ర్గం తనకు పూర్తి అండ‌గా ఉంటుందని భావిస్తున్నారట కవిత. ఈ క్రమంలో బీఆర్ఎస్‌ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే విష‌యంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బెట‌ర్ అనే ఆలోచనకు కవిత వచ్చారని అంటున్నారు. స్థానిక ఎన్నిక‌ల‌కు ముందే కవిత కీలక నిర్ణయం ప్రక‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అయితే గతంలోనూ కవిత బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పడం ఖాయమన్న చర్చ జరిగింది. ఇప్పుడు తాజా పరిస్థితులతో మరోసారి ఆమె కారు దిగడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా కవిత అడుగులు ఎటువైపు పడుతాయో చూడాలి మరి.

Related Posts