
హైదరాబాద్, జూలై 16,
తేలంగాణ రాజకీయం ఫుల్ హీట్ మీదుంది. నువ్వానేనా..తగ్గేదేలే అంటూ అధికార కాంగ్రెస్, అపోజిషన్ బీఆర్ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్లు..విమర్శలతో పొలిటికల్ వార్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నాయి. ఇదే టైమ్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి. మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపాలని గులాబీ పార్టీ ఆల్రెడీ డిసైడ్ అయిందంటున్నారు.ఇప్పటికే గ్రౌండ్‌లో పరిస్థితులను అంచనా వేయడానికి సర్వే కూడా చేయించినట్లు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్‌తో పాటు గ్రేటర్‌లో మరో రెండు బైపోల్స్ రాబోతున్నాయన్న టాక్ ఊపందుకుంది. ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు కూడా ఉప ఎన్నిక రావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌లో గెలిచి..కాంగ్రెస్‌లో చేరి..హస్తం పార్టీ సింబల్ మీద ఎంపీగా కంటెస్ట్ చేసిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 18 తర్వాత ఎప్పుడైనా కోర్టు తీర్పు రావొచ్చంటున్నారు.ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు పడే కంటే ముందే రాజీనామా చేయాలనే ఆలోచనలో దానం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి పదవి ఇస్తానంటే..జూబ్లీహిల్స్‌లో పార్టీని గెలిపిస్తా..తాను రిజైన్ చేసి ఖైరతాబాద్‌లో మళ్లీ గెలుస్తానని దానం కండీషన్ పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజుల్లోపే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. నెలాఖరులో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కడం పక్కా అని..మినిస్టర్ హోదాలోనే ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా గాంధీభవన్ వర్గాల ఇన్ సైడ్ టాక్.దానం రిజైన్ చేస్తే గ్రేటర్‌లో రెండు బైపోల్స్ పక్కా. అదీ కూడా పక్క పక్క నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ సందర్భంగా రాజీనామా చేయడం దుమారం లేపింది. ఇప్పుడు ఆయన రిసిగ్నేషన్‌ను పార్టీ హైకమాండ్ ఆమోదించడంతో రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ నేతలు కూడా రాజాసింగ్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు తెస్తున్నారు.అవసరమైతే అనర్హత వేటు కోసం స్పీకర్‌కు కంప్లైంట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ కూడా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలని భావిస్తున్నారట. అదే జరిగితే గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు బైపోల్స్ రావడం పక్కా. అటు దానం..ఇటు రాజాసింగ్ జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే రిజైన్ చేస్తే..మూడు బైపోల్స్‌కు ఒకేసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అటు దానం..ఇటు రాజాసింగ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం.. భాగ్యనగరం వేదికగా మినీ దంగల్ పక్కా.ఇదే జరిగితే పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంతేకాదు ఒకేసారి మూడు బైపోల్స్ అంటే చిన్న విషయం కాదు. అన్నీ పార్టీలకు ప్రెస్టేజ్‌కా సవాల్. ఇందులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు రెండు..బీజేపీది ఒకటి. ఇప్పటికే గ్రేటర్‌లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్‌లో గెలిచిన కాంగ్రెస్..మూడు సీట్లకు ఉప ఎన్నికలు వస్తే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందిఇక రాజాసింగ్ విషయానికొస్తే బీజేపీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదిస్తుందని ఆయన ఊహించలేదట. తన వెర్షన్ విని..అంతా సెట్‌రైట్ చేస్తారని భావించారట. అయితే రాజీనామా ఆమోదంతో..రాజాసింగ్ మహారాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్రలోని ఉద్దవ్ శివసేనలో చేరి..ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉంటూ..అక్కడ..ఇక్కడ పాలిటిక్స్ చేయాలనేది రాజాసింగ్ వ్యూహమట.లేకపోతే మహారాష్ట్రలోనే యాక్టీవ్ పాలిటిక్స్‌లో ఉండాలనేది రాజాసింగ్ ఆలోచన అని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో గోషామహల్ నుంచి మళ్లీ పోటీ చేసి గెలవాలనే కసితో రాజాసింగ్ ఉన్నా..బీజేపీ ఆయనపై అనర్హత ఫిర్యాదు చేసినా..బైపోలో రావడం ఖాయం. అదే జరిగితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందే..రాష్ట్ర రాజధానిలో మూడు అసెంబ్లీ సీట్ల ఎన్నికల సమరం పొలిటికల్ హీట్‌ను పెంచనుంది. దానం ఇచ్చిన ఆఫర్‌పై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది..? ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రాజాసింగ్ ఆలోచనేంటి.? అనేది చూడాలి మరి.