YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

భక్తుడి దుర్మరణం తిరుమల లో శుద్ది కార్యక్రమం 

భక్తుడి దుర్మరణం తిరుమల లో శుద్ది కార్యక్రమం 

భక్తుడి దుర్మరణం
తిరుమల లో శుద్ది కార్యక్రమం 
తిరుమల డిసెంబర్ 13
తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు శుక్రవారం  ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆలయానికి పాలను తీసుకు వస్తున్న పాల వ్యాన్ వెనక చక్రాల కింద పడి తమిళ నాడు భక్తుడు. తనువు చాలించాడు. అనుకోని ఈ దుర్ఘటనతో అక్కడే ఉన్న భక్తుల్లో ఆందోళన కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన వ్యక్తితో మరెవరూ లేకపోవడంతో అతను ఎవరన్న ఆచూకి తెలియలేదు. ఈ ఘటనపై టీటీడీ ఆగమ సలహాదారు రమణ దీక్షితులు మీడియా తో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఓ భక్తుడు పాల వ్యాన్ క్రింద పడి చనిపోవడం దారుణమని అన్నారు. మాఢ వీదులలో మరణం జరగడంతో ఆలయంలో శుద్ది కార్యక్రమం చేసి తరువాత యధావిధిగా కార్యక్రమాలు నిర్వహించాం. తిరుమలలో దేహ త్యాగం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మూడనమ్మకంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అయన అన్నారు. తిరుమలలో ప్రమాదవశాత్తు ఏదైనా మరణం సంభవిస్తే అలాంటి వారికి మాత్రమే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. బలవంత మరణం చాలా దారుణం. ఇలాంటి చర్యలకు భక్తులు ఎవరు పాల్పడవద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చాలా పాపమని అయన వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేవిదంగా ఉన్న చర్యలు ఎవరూ చేయకూడదని అయన కోరారు. 

Related Posts