YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

వంట గ్యాస్ మరింత భారం..?

వంట గ్యాస్ మరింత భారం..?

నిత్యావసర వస్తువుగా మారిన వంట గ్యాస్ ధర సామాన్య ప్రజలకు మరింత భారం కానున్నది.  వచ్చే నెల నుంచి సీఎన్జీతో పాటు, వంట గ్యాస్ ధర పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రతి ఆర్నెల్లకొకసారి గ్యాస్ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.ధరలను పెంచడం ద్వారా ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీలకు మరింత ఆదాయం చేకూరనుంది. ఇతర వనరుల నుంచి సేకరించే గ్యాస్ ధరను కూడా ప్రభుత్వం పెంచనుంది. ప్రస్తుతం యూనిట్ కు  2.89డాలర్లు చెల్లిస్తుండగా, వచ్చే నెల నుంచి ఇది 3.06 డాలర్లకు చేరనుంది. సహజవాయువు ధర పెంపు కారణంగా విద్యుత్, యూరియా తయారీ ధర కూడా పెరగనుంది. సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న గ్యాస్ను వెలికి తీసేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ గ్యాస్ యూనిట్ కు 6.3డాలర్లు లభ్యమవుతుండగా, దీని ధరను 6.5 డాలర్ల నుంచి 6.6 డాలర్లకు పెంచనున్నారు. కాగా గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకూ ఐదుసార్లు గ్యాస్ ధరను ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చిండడం గమనార్హం.

Related Posts