YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు సాహిత్యం తెలంగాణ

కాకతీయ కట్టడాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి

కాకతీయ కట్టడాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి

కాకతీయ కట్టడాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్ డిసెంబర్ 19 
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  అమెరికా కు చెందిన ప్రొఫెసర్ ఫిలిప్ వాగ్నేర్ రచించిన ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ మాన్యుమెంట్స్ పుస్తకం ను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అర్చరీ ఫెడరేషన్ అధ్యక్షులు పాపారావు, కాకతీయ హెరిటేజ్ సభ్యులు , పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో చరిత్ర ఉందన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయం ను యునెస్కో గుర్తింపు లభించేందుకు కృషి చేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ను అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక అవశేషాల్ని గుర్తించేందుకు చారిత్రక పరిశోధకులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి  కేసీఆర్  తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల కు పెద్దపీట వేస్తున్నారన్నారు. అందులో భాగంగా యాదాద్రి లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ను సుమారు 1000 కోట్లతో నిర్మిస్తున్నారని వెల్లడించారు.

Related Posts