YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు రద్దీ

విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు రద్దీ

 సంక్రాంతి పండగ పర్వదినాలు ముగియడంతో సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారితో విశాఖ రైల్వేస్టేషన్‌లో తీవ్ర రద్దీ నెలకొంది. ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయకపోవడంతో స్టేషన్‌లోని సాధారణ బుకింగ్‌ కేంద్రాలతో పాటు పలు ఫ్లాట్‌ఫారాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, హౌరా, బెంగుళూరు, చెన్నై, విజయవాడ, భువనేశ్వర్, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌ రైళ్లతో పాటు.. విజయనగరం, శ్రీకాకుళం, పలాస, వైపు నడిచే పాసింజర్ రైళ్లు రద్దీగా నడుస్తున్నాయి.  మధ్యాహ్నం రత్నాచల్, ఇంటర్ సిటీకి ప్రయాణికులు పోటెత్తారు.

గంట ముందుగానే స్టేషన్‌కు‌ చేరుకుని సీట్ల కోసం క్యూ కట్టారు. అయితే విజయవాడ నుంచి ఇక్కడకు చేరిన రత్నాచల్ కూడా రద్ధీగా ఉండడంతో రైలెక్కే, దిగే వారితో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికులను నియంత్రించాల్సి వచ్చింది.
సికింద్రాబాద్‌, విజయవాడ, బెంగళూరు, చెన్నై వైపు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్‌ బోగీలు నిండిపోవడంతో సాధారణ బోగీలకు తీవ్రమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి సాధారణ టిక్కెట్లు కోసం క్యూలో నిలబడాల్సి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడవడంతో పలు పాసింజర్‌ రైళ్లను ఎక్కడికక్కడే గంటల తరబడి నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

Related Posts