YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రాతో బాటు తెలంగాణ.. కోడి పందాల స్థావరాలు ఏర్పాటు

ఆంధ్రాతో బాటు తెలంగాణ.. కోడి పందాల స్థావరాలు ఏర్పాటు

ఆంధ్రాతో బాటు తెలంగాణ.. కోడి పందాల స్థావరాలు ఏర్పాటు
హైదరాబాద్ డిసెంబర్ 24
సాధారణంగా సంక్రాంతి సీజన్ లో ఆంధ్రాలోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలలో కోడి పందాల జోరు వినవస్తుంది. కానీ ఈ సారి వెరైటీగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా నుంచి వచ్చింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కోడి పందాల స్థావరాలు ఏర్పాటు చేసుకుని కొందరు వ్యక్తులు కోడి పందాలు నిర్వహిస్తున్నారు.గ్రామ శివారులో పోలీసులు నేడు దాడి చేయడంతో కోడిపందాల స్థావరాల గుట్టు రట్టయింది. ఈ స్థావరాలు నిర్వహిస్తున్న ఐదు గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు,9 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. సక్రాంతి సీజన్ కావడంతో ఆంధ్రాతో బాటు తెలంగాణలోని చాలా గ్రామాలలో కోడిపందాలకు కొందరు సిద్ధమైపోతున్నారు.

Related Posts