YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

కేవైసీ నిబంధనల్లో మారొచ్చంటూ రూమర్లు క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శి

కేవైసీ నిబంధనల్లో మారొచ్చంటూ రూమర్లు క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శి

కేవైసీ నిబంధనల్లో మారొచ్చంటూ రూమర్లు క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శి
న్యూఢిల్లీ డిసెంబర్ 24 
భారతీయ పౌరులు బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్‌కు మతం గురించి తెలియజేయాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. బ్యాంకుల నుంచి మతం ప్రాతిపదికన ఎలాంటి నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని కోరారు.రాజీవ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘భారతీయ పౌరులు బ్యాంకులో అకౌంట్ తెరిచేందుకు కేవైసీ కోసం మతాన్ని తెలియజేయాల్సిన అవసరం లేదు. అర్ధరహిత రూమర్లను విశ్వసించొద్దు. బ్యాంకులు మతం ప్రాతిపదికన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవు’ అని ట్వీట్ చేశారు.ఒక ట్విట్టర్ యూజర్ ఎస్‌బీఐ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్‌ను చూపిస్తూ.. ‘ఎస్‌బీఐ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్‌లో మతం కాలమ్ ఉంది. ఇక్కడ మతాన్ని కచ్చితంగా తెలియజేయాలా? లేదంటే ఫిల్ చేయకుండా వదిలేయవచ్చా? తెలియడం లేదు’ అని ట్వీట్ చేశారు. దీనికి రాజీవ్ కుమార్ రిప్లే ఇచ్చారు. మతం తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.మరోవైపు బ్యాంకులు నో యువర్ కస్టమర్ (కేవైసీ) ఫామ్‌లో కొత్త కాలమ్‌ను తీసుకురాబోతున్నాయని వదంతులు వ్యాపించాయి. ఇందులో కస్టమర్లు వారి మతం తెలియజేయాల్సి ఉంటుందనే రూమర్లు వచ్చాయి. ఫేమా యాక్ట్ నిబంధనల సవరణ కారణంగా ఈ మార్పు చోటుచేసుకోబోతుందని వార్తలు వినిపించాయి.అయితే ఆర్థిక కార్యరద్శి రాజీవ్ కుమార్ మాత్రం ఈ వదంతులను కొట్టిపారేశారు. బ్యాంకుల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవని స్పష్టం చేశారు. ప్రజలు, ఖాతాదారులు ఇలాంటి అసత్యాలను విశ్వసించొద్దని కోరారు. భారతీయ పౌరులు ప్రతి ఒక్కరు బ్యాంక్ సేవలు పొందొచ్చని తెలిపారు.

Related Posts