YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

తిరుప్పావై  పదిహేనవ రోజు పాశురము*

తిరుప్పావై  పదిహేనవ రోజు పాశురము*

తిరుప్పావై  పదిహేనవ రోజు పాశురము*
15 వ పాశురం
*ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో*
*శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్* *నంగైమీర్! పోదరుగిన్ఱేన్*
*వల్లై ఉన్ కట్టురైగళ్* *పండేయున్ వాయఱిదుమ్*
*వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ*
*ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై*
*ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్*
*వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క*
*వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్*
*భావం*
  మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది. ఈరోజు పదిహేనవ పాశురం బయటగోపబాలికలకు లోపలగోపబాలిక మద్య సంభాషనలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో నని అనుకోని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.
అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో,  "ఎల్లే!" ఏమే  "ఇళంకిళియే!" లేత చిలకా!  "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.  కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని,  శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు "నంగైమీర్!" పరిపూర్ణులు మీరే.  "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది. బయట నుండి వాళ్ళు " వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీనోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్"  ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు.  అంతలో లోపల గోప బాలిక "వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు,  నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను,  మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు,    "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది. కాని బయట నుండి, "ఒల్లై నీ పోదాయ్"  ఏమే రా! మరి ఇంక,  "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరోకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి "ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.
పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై " బలం కల్గిన ఏనుగు -కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తోలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం. ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మల్లీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ.పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన,  శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముశ్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు.  ఇది భగవంతుడు చేసే చేష్ట.   ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి  ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు.  తిరుప్పావై మనకు  అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.
*అవతారిక:*
 వ్రతాన్ని చేయటానికై తమ
గోష్ఠిలో చేర్చుకొనదగిన పదవ గోపికను యీ మాలికలో గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది సంభాషణ రూపంలో వున్న అద్వితీయ పాశురం. ఈ గోపికను యీగోష్ఠి నంతను సేవించవలెనను కుతూహలమున్నది. భగవద్గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించటం తగదని అందుకే గోష్ఠిలోని అందరకూ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెప్తున్నది. ఇక్కడితో వ్రతంలోని రెండవ దశయైన ఆశ్రయణ దశ పూర్తవుతుంది. వ్రత మిషతో భగవద్గుణాలనందరకు పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన ఆండాళ్ తల్లి శ్రవణ, మనన, ధ్యానాలనే వాటిని చక్కగా విశదపరచి నిరూపించింది. భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి. మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది. దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్త్యతను పొందుతుంది. ఈ పదవ గోపిక లక్షణాలు కూడా యివే! ఇట్టి నిద్రలో మునిగివున్న యీ పదవ గోపికను తమ గోష్ఠిలో చేరమని సంభాషణా రూపంలో సమాధానపరచి గోష్ఠిలో చేర్చుకున్నది గోదా తల్లి.
*(కమాసురాగము - ఏకతాళము)*
వారు:    చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే!
ఆమె:    చెలియలార! ఉలికి పడగ పిలువకు డిదె వచ్చుచుంటి.
వారు:    పుల్లవిరుపు మాటల నీ చతురోక్తుల నెరుగుదుమే?
ఆమె:    అల్లన మీరె చతురలు! నన్నిట్టుల నుండనీరె!
    వలసినవారెల్ల రిచట కూడిరి! ఓ చెలియరో!
వారు:    చెలులెల్లరు వచ్చిరి నీ వెంచుకోవె! సఖియరో!
ఆమె:    ఏల నేను రావలె! మీకేమి నేను చేయవలె?
వారు:    బలియుని కువలయకరి మదమణచిన శ్రీకృష్ణుని లీలల
    కీర్తింప నీవు శీఘ్రమే రావమ్మరో!
    చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే?

Related Posts