YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 వైకుంఠ ఏకాదశి రోజున కుర్మావతారంలో  వెంకటేశ్వర స్వామి

 వైకుంఠ ఏకాదశి రోజున కుర్మావతారంలో  వెంకటేశ్వర స్వామి

 వైకుంఠ ఏకాదశి రోజున కుర్మావతారంలో  వెంకటేశ్వర స్వామి
నంద్యాల జనవరి 4  
ఏకాదశిలలో అత్యంత విశిష్టమైన వైకుంఠ ఏకాదశి కి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కుర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తారని శ్రీ భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సముద్రాల సూరయ్య పేర్కొన్నారు.వైకుంఠ ఏకాదశికి మరో పేరైన మోక్ష ఏకాదశికి స్వామివారిదర్శనం తో పాపపరిహారం,మోక్షప్రదం జరుగుతుందన్నారు.శనివారం శ్రీ కోదండరామాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో .  ఆయన మాట్లాడుతూ ధనుర్మాసం నుంచి ఆలయంలో తిరుప్పావై దివ్య కార్యక్రమంను నిర్వహిస్తున్నామన్నారు.పవిత్రమాసం సోమవారం వైకుంఠ ఏకాదశికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు కుర్మావతారంలో దర్శనమిస్తారన్నారు.వైకుంఠ ఏకాదశికి స్వామివారిని దర్శిస్తే పాపాపరిహారంతో పాటు మోక్షప్రదం జరుగుతుందన్నారు.సోమవారం ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటలవరకు దర్శనమిస్తారన్నారు.వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శన పులా తోరణం,వైకుంఠద్వారా పులతోరణం,ప్రత్యేక వస్త్రాలంకార సేవ,పూలంగి సేవ,లడ్డు పడి సేవ ఉత్తవ మూర్తులకు అలంకార సేవలు నిర్వహిస్తున్నామన్నారు.పట్టణ,గ్రామీణ ప్రాంత భక్తులు స్వామి వారిని దర్శించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మధుసూదన్ రావు,గురుప్రసాద్,జయచంద్రారెడ్డి,వసంత రాఘవ ప్రభు,హరనాథ్,శ్రీధర్,సురేంద్ర మోహన్,చంద్రశేఖర్,పద్మనాభయ్య,చక్రపాణి,జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts