YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రిలో సంక్రాంతి సంబరాలు

ఇంద్రకీలాద్రిలో సంక్రాంతి సంబరాలు

ఇంద్రకీలాద్రిలో సంక్రాంతి సంబరాలు
విజయవాడ జనవరి 13
ఈ నెల 14 నుం చి 16 వరకు ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. మంగళవారం  ఉదయం 6 గంటలకు బోగి మంటలతో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని  దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్ బాబు తెలిపారు. మంగళవారం  ఉదయం 10 గంటలకు వ్రుద్ధాశ్రమంలో ఉన్న దుర్గమ్మ కు అమ్మవారి దర్శనానికి తీసుకువచ్చి అమ్మవారి వారి చీర అందచేస్తాం. ఈ నెల 30 న శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం. ఆరోజు విద్యార్ధులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నామని అన్నారు. ఈ నెల 31 న సివి రెడ్డి వర్ధంతి కావడంతో 100 మందికి స్కాలర్ షిప్పులు ఇస్తున్నాం. ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనార్దం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. ఇకపై జీన్స్, సంప్రదాయ దుస్తుల్లో రాకుంటే అంతరాలయ దర్శనం కల్పించమని అన్నారు. 300 రూపాయల టిక్కెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. కొండపైన అర్జునుడు ప్రతిష్టించిన ఆలయానికి భక్తులను అనుమతించే మార్గంపై ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం..త్వరలోనే భక్తులకు ఆ వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. కేశఖండన శాల, ప్రసాదం పోటు శాశ్వత భవనాలకు త్వరలోనే శంకుస్ధాపనకు శ్రీకారం చుడుతున్నాం.  అమ్మవారికి పులిహోర ప్రసాదాన్ని ఐదు రూపాయల నుంచి 10 రూపాయలకు పెంచే యోచనలో ఉన్నామని అయన వెల్లడించారు. 

Related Posts