YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

నకిలీ దందాలు.. బ్రాండెడ్ పేరుతో మోసాలు

నకిలీ దందాలు.. బ్రాండెడ్ పేరుతో మోసాలు

నకిలీ దందాలు.. బ్రాండెడ్ పేరుతో మోసాలు
నిజామాబాద్, జనవరి 17,
నిజామబాద్ జిల్లాల్లో  వ్యాపారులు బ్రాండెడ్ కవర్లలో కల్తీ నూనెను నింపి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నూనె అంత ఒకే లా ఉన్నా స్ప్రె రసాయనాలు కలిపి ఆ బ్రాండెడ్ వాసన వచ్చేలా పక్కా ప్రణాళికతో దశాబ్దాలుగా ఈ దందా సాగిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీ ఆయిళ్లతో పాటు నిత్యం ప్ర జలు ఉపయోగించే పల్లినూనె, సన్‌ఫ్లవర్, కాటన్ తదిత ర ఆయిల్‌ను కల్తీ చేస్తూ తమ అక్రమ వ్యాపారాన్ని ప్రజ ల ప్రాణాలను పణంగా పెడుతూ చేస్తున్నారు. జీరో వ్యా పారం కావడంతో పలువురు దీనిపై కన్నేశారు. అధికార యంత్రాంగం, స్థానిక రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులను తమ కన్నుసైగలోనే ఉంచుతూ అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. సంక్రాంతి పండుగ పూ ట ప్రతి ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం ఆనవాయి తీ. దీనిని ఆసరా తీసుకొని వ్యాపారులు నూనెను మ రింత చేస్తున్నారు.మెదక్, సిద్ధిపేట్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మ ల్, కరీంనగర్, సిరిసిల్ల, తదితర జిల్లాలకు కల్తీ నూనెను గుట్టు చప్పుడుకాకుండా అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 5 గంటల లోపు తరలిస్తున్నారు. వీరికి అడ్డువచ్చే వారిని నయానో, బయానో లొంగదీసుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ దందాను ఆ ప్రాంత రైతులకు దుర్వాసన రావడంతో ప సిగట్టి అధికారులకు సమాచారం అందజేశారు. దా డులు చేసి కల్తీ నూనెను స్వాధీనం చేసుకొని అక్కడి బట్టీ సామగ్రిని సీజ్ చేశారు. రెండురోజులు హడావుడి చేసిన అధికార యంత్రాంగం ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూ డకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సదరు ప్రజాప్రతినిధి తన పలుకుబడితో కేసును పక్కదోవ పట్టించి కేసు నుంచి తప్పుకున్నాడనే ఆరోపణలున్నాయి. కేసు లో అసలు నిందితులను విడిచిపెట్టి కూలీ చేసే వారిని బలి చేసినట్లు పలువురు పేర్కొంటున్నారు.ఒకవైపు ఆయిల్‌మిల్లుల్లో నూనె కల్తీ అవుతుంటే మ రోవైపు రిటైల్‌గా మార్కెట్‌లో నూనెను విక్రయించే వ్యా పారులు కల్తీ చేయడంలో ఆరితేరారు. ఇంటి వద్దనే నూ నెలను కల్తీ చేసి విడిగా అమ్మడంతో పాటు చేతి మిషన్ సహాయంతో ప్లాస్టిక్ కవర్లను తమకు నచ్చిన పేరు గల వాటిని తెప్పించుకొని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో మారుమూల గ్రామాల్లో సైతం నూనె వి క్రయ దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అధికారులు దాడులు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న వ్యాపారుల అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఆయిల్ మిల్లుల్లో సీజన్‌తో సంబంధం లేకుండా నూనె గానుగ పడుతారు. ప్రధానంగా పల్లి, సన్‌ఫ్లవర్ నూనె తీస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి భా రీగా పల్లి, సోయాబీన్, పొద్దుతిరుగుడు విత్తనాలను వ్యాపారులు కొనుగో లు చేస్తారు. కాటన్ విత్తనాల ను కూడా దిగుమతి చేసుకుంటారు. ముందుగా చే సుకున్న ఒప్పందం ప్రకారం పల్లి, సన్‌ఫ్లవర్ నూ నెల్లో చౌకగా లభించే కాటన్ నూనెలను కలిపి కల్తీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Related Posts