YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

మధ్యాహ్న భోజన పథకాన్ని కొత్త మెనూ ప్రకారం నిర్వహించాలి

మధ్యాహ్న భోజన పథకాన్ని కొత్త మెనూ ప్రకారం నిర్వహించాలి

మధ్యాహ్న భోజన పథకాన్ని కొత్త మెనూ ప్రకారం నిర్వహించాలి
 మండల విద్యాధికారి సుదర్శన్ రెడ్డి
నందవరం జనవరి 22, 
నందవరం మండలపరిధి లో మధ్యాహ్న భోజన పథకాన్ని యం డి యం ఏజెన్సీలు కొత్త మెనూ ప్రకారం నిర్వహించాలని మండల విద్యాధికారి సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన నందవరం మండల వనరుల కేంద్రం నందు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక సమావేశంలో ఏర్పాటు చేశారు .ఈ సమావేశంలో మండల విద్యాధికారి సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  "గోరుముద్ద "పథకాన్ని సక్రమంగా అమలు అయ్యే టట్లు చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు .అమ్మ ఒడి పథకానికి సంబంధించి మొత్తం మండల స్థాయిలో 12165 మంది దరఖాస్తు చేసుకోగా పదివేల 198 మంది అర్హులుగా గుర్తించారు అని అన్నారు .అందులో కూడా చివరకు ఆరువేల 277 మంది అమ్మఒడి పథకానికి అర్హత పొందారన్నారు. 1967 మంది వివిధ కారణాలతో పెండింగ్ లో ఉంచడం జరిగింది అని అన్నారు. వీటిని ప్రభుత్వము మార్చి నెలలో పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది అన్నారు. మనబడి నాడు-నేడు కింద పది పాఠశాలలకు ప్రహరీ గోడలు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వము 2020 -2021 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టుటకు ప్రభుత్వము ప్రవేశపెట్టిన విధి విధానాలను గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలల సంబంధించి యు డైస్  గురించి ప్రధానోపాధ్యాయులకు సూచనలు సలహాలు అందించారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ పి లు ఉరుకుందు, అనిల్ కుమార్, మహేశ్వరి, ఎం ఐ ఎస్ ప్రసాద్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts