YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వాళ్లిద్దరి మధ్య’  తొలి తలుపులోనే...

వాళ్లిద్దరి మధ్య’  తొలి తలుపులోనే...

‘వాళ్లిద్దరి మధ్య’  తొలి తలుపులోనే...

తొలి చూపు... తొలి వలపు- ఈ  రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం మూమూలుదికాదు. ఆ రెండిటికీ మధ్య  ఓ తలుపు కూడా ఉంటే దాని వెనుక కూడా పెద్ద  కథే ఉంటుంది... అది ఓ బ్లాక్ బస్టర్ హిట్ కు కూడా నాంది పలుకవచ్చు. విషయంలోకి వస్తే  ‘బాబి’ సినిమాలోకి వెళదాం. ఇది హిందీ ‘బాబి’ సుమా. రాజ్ కపూర్ కుమారుడు రిషికపూర్, డింపుల్ కపాడియా  జంటగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ అప్పటికే హిందీలో వచ్చిన  ప్రేమ కథల రికార్డులను తిరగరాసింది. ఇందులో హీరో  రిషికపూర్ , హీరోయిన్ డింపుల్ కపాడియా ఇంటికి రాగానే ఆమె సున్నిపిండి రాసుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. నిజానికి  ఇది రాజ్ కపూర్ స్వీయ అనుభవమే. ఆయన నిజజీవితంలో నర్గిస్ ను అలాగే కలుసుకున్నారట. దాన్ని సినిమాలో  చూపించాలని ఎంతో తహతహలాడినా కథలు సహకరించలేదు. ఆ కోరికను ‘బాబి’ తీర్చింది. ఆ సినిమాలో హీరోయిన్ తొలి  సన్నివేశం కూడా అదే. దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఈ సినిమాను చిన్నపుడు చూసి థ్రిల్ అయిపోయారు . దర్శకుడయ్యాక ఇలాంటి షాట్ తీయాలని అనుకున్నా కుదరలేదట. ఆ కోరికను ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా తీర్చింది అంటారు ఆదిత్య.  ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా ద్వారా పరిచయమవుతున్న  హీరోయిన్ నేహాకృష్ణ పై ఇలాంటి సన్నివేశాన్నే ఆదిత్య చిత్రీకరించారు. వినాయకుడు బొమ్మ చెక్కి ఉన్న తలుపును హీరో విరాజ్  అశ్విన్ తట్టగానే ,  హీరోయిన్ నేహాకృష్ణ తలుపు తీస్తుంది . ఇది ఆమె కెరీర్ లో మొదటిరోజు మొదటి షాట్. ఈ వినాయకుడి  తలుపు వాళ్లిద్ధిరి ప్రేమకు ఎలాంటి విఘ్నాన్ని అయినా కలిగించవచ్చనే సందేహాన్నిప్రేక్షకులకు కలిగించే ఉద్ధేశంతోనే ఈ  సింబాలిక్ షాట్ ను ఆదిత్య తెరకెక్కించినట్టు  కనిపిస్తోంది. ఈ విషయంపై వి.ఎన్. ఆదిత్యను ప్రశ్నిస్తే ‘బాబిలోని సన్నివేశం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది . ఒక రియల్ లైఫ్ లో అంకురించిన ప్రేమ ,   ఒక బ్లాక్ బస్టర్  సినిమా లవ్స్టోరీ కి ఒక షాట్ అయింది. డింపుల్ కపాడియాపైన షూటింగ్ చేసిన మొదటి షాట్ కూడా అదే. ఆ దృశ్యం చిన్నప్పటినుంచీ నాతో ట్రావెల్ అవుతూనే ఉంది. ఇలాంటి సన్నివేశాన్ని తెరపై చూపించే అవకాశం నాకు ఇన్నాళ్లకు దక్కింది. అయితే ఆ కథ వేరు... ఈ కథ వేరు. అందులో సున్నిపిండి ఉంది.. ఇందులో లేదు.. అంతే తేడా ’ అని వివరించారు. తెలుగుసినిమా పరిశ్రమలోకి హీరోయిన్ నేహాకృష్ణ ప్రవేశాన్ని ఇలా విఘ్నేశ్వరుడి తలుపు ద్వారా స్వా గతించాలనే ఉద్దెశంతో కూడా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టు   ఆయన చెప్పారు.   వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్   పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి నిర్మాత అర్జున్ దాస్యన్.నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ  '' షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . సినిమా చాలా బాగా వచ్చింది. అతి త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటిస్తాము '' అని తెలిపారు. 
తారాగణం : విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ, వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్ , నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ ,భార్గవ్, రామకృష్ణ తదితరులు .

Related Posts