YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో 

రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో 

రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో 
తిరుమ‌ల  జనవరి 27 
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్రవరి 1వ తేదీన జ‌రుగ‌నున్న రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆల‌య మాడ వీధుల్లో చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఉద‌యం 5.30 గంట‌లకు సూర్యప్ర‌భ వాహ‌నంతో మొద‌లై రాత్రి 9.00 గంట‌ల వ‌ర‌కు వ‌రుస‌గా చిన్న‌శేష‌, గ‌రుడ‌, హ‌నుమంత వాహ‌నాలు, చ‌క్ర‌స్నానం, క‌ల్ప‌వృక్ష‌, స‌ర్వ‌భూపాల‌, చంద్ర‌ప్ర‌భ వాహ‌నాల‌పై స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు. భ‌క్తులు చ‌లికి, ఎండ‌కు, వ‌ర్షానికి ఇబ్బందులు ప‌డ‌కుండా గ్యాల‌రీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. భ‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు టి, కాఫి, పాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు నిరంతరాయంగా పంపిణీ  చేస్తామ‌న్నారు.        గ్యాల‌రీల‌లో ఉన్న భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌కు ఫుడ్ కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. భ‌క్తులకు మ‌రింత మేరుగైన సేవ‌లందించేందుకు అద‌న‌పు సిబ్బందికి డెప్యుటేష‌న్ విధులు కేటాయిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు.ప్ర‌తి గ్యాల‌రీలో శ్రీ‌వారి సేవ‌కులు, ఆరోగ్య సిబ్బంది ఉంటార‌ని, సీనియ‌ర్ అధికారుల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌ని తెలిపారు. భ‌క్తులు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించి గ్యాల‌రీల్లో వేచి ఉండి వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించాల‌ని కోరారు. భ‌క్తులు వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు వివ‌రించారు.   ముందుగా గ్యాల‌రీల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక షెడ్ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. మాడ వీధుల్లో తీర్చిదిద్దుతున్న రంగ‌వ‌ల్లుల‌ను ప‌రిశీలించారు.  అద‌న‌పు ఈవో వెంట టిటిడి  సిఇ  రామచంద్రారెడ్డి, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2  నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ(ఎల‌క్ట్రిక‌ల్‌)  వెంక‌టేశ్వ‌ర‌రావు, విఎస్‌వో  మ‌నోహ‌ర్‌, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో  నాగ‌రాజ‌, క్యాట‌రింగ్ అధికారి  జిఎల్ఎన్‌.శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Posts