YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

గతి తప్పిన  ‘తియాంగోంగ్-1’

Highlights

  • భూమిపైకి దూసుకొస్తున్నఅంతరిక్ష పరిశోధన కేంద్రం 
  • ఈనెల 31 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్య కూలిపోయే ప్రమాదం 
  • ప్రపంచాన్ని భయపెడుతున్నవైనం 
గతి తప్పిన  ‘తియాంగోంగ్-1’

 చైనా 2011లో ప్రయోగించిన తొలి అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘తియాంగోంగ్-1’ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఐదేళ్లపాటు విజయవంతంగా సేవలందించిన ఈ స్పేస్ స్టేషన్ ఇప్పుడు గతి తప్పి భూమిపైకి దూసుకొస్తోంది. అయితే అది ఎక్కడ పడుతుందో నిర్దిష్టంగా చెప్పలేకపోతుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈనెల 31 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్య కూలిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతుండడం ప్రజల్లో భయం మరింత ఎక్కువైంది. శాస్త్రవేత్తలు మాత్రం భయపడాల్సిన అవసరం లేదని, తియాంగోంగ్-1 భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతుందని చెబుతున్నారు.మూడు మిషన్లకు బేస్ స్టేషన్‌గా పనిచేసిన తియాంగోంగ్-1 జీవితకాలం నిజానికి రెండేళ్లే అయినప్పటికీ ఐదేళ్లపాటు నిరంతరాయంగా సేవలందించింది. ఆ తర్వాత ఇది గతితప్పి భూమి వైపుగా కదలడం ప్రారంభించడంతో దానిని స్థానాన్ని భర్తీ చేసేందుకు చైనా తియాంగోంగ్-2ను పంపింది. ఇక, 19 వేల పౌండ్ల బరువైన తియాంగోంగ్-1 స్పేస్ స్టేషన్ ఎక్కడ కూలుతుందో సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. గతేడాది చివర్లో ఇది కూలిపోతుందని తొలుత భావించిన శాస్త్రవేత్తలు ఆ తర్వాత గతేడాది అక్టోబరు, ఏప్రిల్ 2018 మధ్య కూలే అవకాశం ఉందనితేల్చారు. అయితే మార్చి నెల మధ్యలో భూమిపై పడుతుందని ఈ ఏడాది జనవరిలో కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ కార్పొరేషన్ పేర్కొంది. తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అది ఎప్పుడు కూలేది స్పష్టంగా చెప్పింది. మార్చి చివరి వారంలో, లేదంటే ఏప్రిల్ తొలి వారంలో ఇది కూలిపోతుందని, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్ తదితర ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో భూమిని ఢీకొడుతుందని తేల్చి చెప్పింది. దీంతో ఆయా దేశాల ప్రజలు  సమయం దగ్గరపడుతున్న కొద్దీ భయంతో వణికిపోతున్నారు.

Related Posts