YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

ఫస్ట్ వన్డేలో ఇండియా ఓటమి

ఫస్ట్ వన్డేలో ఇండియా ఓటమి

ఫస్ట్ వన్డేలో ఇండియా ఓటమి
హామిల్టన్, ఫిబ్రవరి 5
న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌కు తొలి ఓట‌మి ఎదురైంది.బుధ‌వారం హామిల్ట‌న్‌లోని సెడాన్ పార్కు వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో నాలుగు వికెట్ల‌తో భార‌త్‌ను కివీస్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల‌కు 347 ప‌రుగుల భారీ స్కోరును సాధించింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (103) కెరీర్‌లో తొలిసెంచ‌రీతో అద‌రగొట్టాడు. కేఎల్ రాహుల్ (88 నాటౌట్) అజేయ అర్ధ‌సెంచ‌రీ చేయ‌గా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51) ఫిఫ్టీతో రాణించాడు. అనంత‌రం న్యూజిలాండ్ 48.1 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 348 ప‌రుగులు చేసి గెలుపొందింది. వెట‌ర‌న్ రాస్ టేల‌ర్ (84 బంతుల్లో 109 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచ‌రీతో రాణించాడు. టామ్ లాథమ్ (69), హెన్రీ నికోల్స్ (78) అర్ధసెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్.. కివీస్ తరపున టామ్ బ్లండెల్ వన్డేల్లో అరంగేట్రం చేశారు. రెండో వ‌న్డే ఆక్లాండ్‌లో శ‌నివారం జ‌రుగుతుంది. నిజానికి ఛేద‌న‌లో కివీస్‌కు శుభారంభం ద‌క్కింది. ఓపెన‌ర్లు మార్టిన్ గ‌ప్తిల్ (32), హెన్రీ నికోల్స్ అదరగొట్టారు. భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న ఈ జంట‌.. తొలి వికెట్‌కు 85 ప‌రుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిర్మించింది. అయితే కుదురుగా సాగుతున్న ఈ జోడీని శార్దూల్ ఠాకూర్.. గ‌ప్తిల్‌ను ఔట్ చేసి విడ‌దీశాడు. అనంత‌రం టామ్ బ్లండెల్ (9) త్వ‌ర‌గానే పెవిలియ‌న్‌కు చేరాడు. ఈద‌శ‌లో నికోల్స్‌-టేల‌ర్‌తో క‌లిసి జ‌ట్టును ముందుకు న‌డిపించాడు.వీరిద్ద‌రూ స మ‌యోచితంగా ఆడారు. వేగంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు బాదారు. అదే జోరులో మూడో వికెట్‌కు 62 ప‌రుగుల జ‌త చేశారు. ఈక్ర‌మంలో అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్న నికోల్స్‌.. త్వ‌ర‌గాన ఔట‌య్యారు. ఈక్ర‌మంలో టేల‌ర్.. టామ్ లాథ‌మ్ (69)తో క‌లిసి జ‌ట్టును విజ‌యం దిశ‌గా నడిపించాడు వీరిద్ద‌రూ నాలుగో వికెట్‌కు 138 ప‌రుగులు జోడించి, భార‌త శిభిరంలో అందోళ‌న రెకేత్తించారు. ఫిఫ్టీ అయ్యాక లాథ‌మ్‌ను ఔట్ చేసిన భారత్‌.. జజేమ్స్ నీష‌మ్ ((9), గ్రాండ్‌హోమ్ (1)ను త్వరగా పెవిలియ‌న్‌కు పంపింది. అయితే మ‌రో ఎండ్‌లో సెంచ‌రీ పూర్తి చేసుకున్న టేల‌ర్ చివ‌రికంటా నిలిచి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. భారత బౌల‌ర్ల‌లో కుల్దీప్‌ యాదవ్‌కు రెండు వికెట్లు ద‌క్కాయి.

Related Posts